: సివిల్స్ ఉద్యోగులు ఒకేచోట నిర్ణీత కాలం పాటు ఉండాలి: సుప్రీం
సివిల్ సర్వీసుల ఉద్యోగులైన కలెక్టర్లు, ఎస్పీలు తదితర ఉన్నతాధికారులు ఒకే చోట కనీస కాలవ్యవధి పాటు పనిచేసేలా ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిర్ణీత కాలవ్యవధికి సంబంధించి కేంద్రంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. సివిల్ సర్వీసుల ఉద్యోగుల పోస్టింగులు, బదిలీలకు సంబంధించి ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. నిర్ణీత కాలం పాటు పనిచేయడం ద్వారా.. పనిలో సామర్థ్యం, నైపుణ్యం అలవడతాయని కోర్టు అభిప్రాయపడింది.