: నేడు జీవోఎంకు టీఆర్ఎస్ నివేదిక
రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ తన నివేదికను అందజేయనుంది. హైదరాబాదును పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా అంగీకరిస్తూనే... నగరంపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని 9 పేజీల నివేదికలో టీఆర్ఎస్ సూచించింది. ఈ నివేదికను కె.కేశవరావు, వినోద్ కుమార్, మాజీ ఐఏఎస్ అధికారులు గోయల్, రమణాచారి, రామలక్ష్మణ్ ల ఆధ్వర్యంలోని కమిటీ తయారుచేసింది.