: 'మిస్ ఆసియా పసిఫిక్'గా భారతీయ వనిత


'మిస్ ఆసియా పసిఫిక్-2013' కిరీటాన్ని భారతీయ వనిత సృష్టి రాణా గెల్చుకుంది. నలభై తొమ్మిది మంది అభ్యర్ధులను వెనక్కి నెట్టి ఆమె ఈ టైటిల్ ను దక్కించుకోవడం విశేషం. హర్యానాలోని ఫరీదాబాద్ కు చెందిన 21ఏళ్ల సృష్టి బాలీవుడ్ నటీమణులు జీనత్ అమన్, దియా మీర్జా తర్వాత ఈ కిరీటాన్ని కైవసం చేసుకున్న మూడో వ్యక్తిగా నిలిచింది. ఈ నెల 30న (బుధవారం) కొరియాలో జరిగిన ఫైనల్ పోటీలో.. తన అందం, తెలివితేటలు, ప్రవర్తనతో జ్యూరీ మెంబర్లను సృష్టి అబ్బురపరిచింది. టైటిల్ గెల్చుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన కల నిజమైందని తెలిపింది. కిరీటాన్ని గెల్చుకున్నందుకు చాలా గర్వంగా ఉందని, ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆనందాన్ని వ్యక్తంచేసింది. పోటీ ఆసాంతం తనకు సహాయపడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పింది.

  • Loading...

More Telugu News