: శాంతిభద్రతలను పరిరక్షించడంలో ఏపీ బాగా పనిచేస్తోంది: టాస్క్ ఫోర్స్ సారథి
శాంతిభద్రతలను పరిరక్షించడంలో ఆంధ్రప్రదేశ్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తోందని కేంద్ర హోం శాఖ టాస్క్ ఫోర్స్ సారథి కె.విజయ్ కుమార్ అన్నారు. నక్సల్స్ అణచివేత వ్యవహారంలో కఠినంగా ఉన్నట్లు గుర్తుచేశారు. విభజన తర్వాత రెండు ప్రాంతాల్లో శాంతిభద్రతలపై అధ్యయనం చేస్తున్నామని మీడియాతో అన్నారు. హైదరాబాద్, తీవ్రవాదం, నక్సలిజం అంశాలపై వివరాలు తీసుకుంటున్నామని, రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి కేంద్రానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో టాస్క్ ఫోర్స్ సారథి భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో తలెత్తే పలు సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది.