: 21 ఏళ్లు దాటితేనే అక్కడ సిగరెట్లు..
పెద్దలను చూసి, సినిమాలను చూసి చిన్న వయసులోనే సిగరెట్లు వెలిగించడం ఫ్యాషనైపోయింది. పాశ్చాత్య దేశాలలో ఇది మరీ ఎక్కువ. అందుకే, న్యూయార్క్ నగరంలో సిగరెట్ల కొనుగోలుకు కనీస వయసును 21 ఏళ్లకు పెంచారు. అంటే 21ఏళ్లు నిండని వారు సిగరెట్లు కొనడానికి వీల్లేకుండా నిషేధం విధించారు. ఇప్పటి వరకు ఈ వయసు పరిమితి 18 ఏళ్లుగా ఉంది. అంత చిన్న వయసు నుంచే పొగపీల్చడం మొదలుపెడితే ఆరోగ్యం బూడిదవదూ..! అందుకే, ఆరోగ్య శ్రేయస్సును కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.