: చైనా రక్షణ రంగానికి 115.7 బిలియన్ డాలర్ల కేటాయింపు
దేశ రక్షణ రంగంపై చైనా ప్రతి ఏడాది ప్రత్యేక దృష్టి పెడుతోంది. ప్రతి బడ్జెట్ లోనూ నిధుల ప్రాధాన్యతను పెంచుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది బడ్జెట్ లో రక్షణ వ్యయాన్ని 10.7 శాతం పెంచింది. అంటే 115.7 బిలియన్ డాలర్లను కేటాయించింది. ఇది భారత్ రక్షణ రంగానికి ఈ ఏడాది కేటాయించిన నిధుల కంటే 37.4 బిలియన్లు ఎక్కువ.
దీంతో, ప్రపంచంలో రక్షణ రంగానికి ఎక్కువ ఖర్చు చేస్తున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో నిలిచింది. దీని ద్వారా చైనా రక్షణ వ్యవస్థ మరింత ఆధునికీకరణ చేయబడుతుంది. గత బడ్జెట్ లో చైనా 106.4 బిలియన్లు కేటాయించింది.