: కోట్ల రూపాయల లాటరీ మళ్లీ కొట్టాడు
అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. దురదృష్టం తలుపు తీసే వరకూ తడుతుంది అంటుంటారు! కానీ, అమెరికాకు చెందిన 67 ఏళ్ల జేమ్స్ బోజ్ మన్ ఇంటి తలుపును అదృష్టం రెండుసార్లు తట్టింది. అదీ డోర్ తీసే వరకూ. ఈ పెద్దాయనకు గతంలో ఒకసారి ఫ్లోరిడా లాటరీ తగిలింది. బహుమతి కోటి డాలర్లు. మన కరెన్సీలో అయితే 60 కోట్ల రూపాయలన్న మాట. ఒక్కసారి కిక్ రుచి చూశాక వదిలిపెడతారా? అలా ఈ పెద్దాయన లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు. 'ఇదిగో నేనున్నా.. నీ కోసం' అంటూ ఫ్లోరిడా లాటరీ 18 కోట్ల(30 లక్షల డాలర్లు) బహుమానం రూపంలో బోజ్ మన్ ను వరించింది. ఆగస్టు 31న తీసిన లాటరీలో జేమ్స్ కొన్న టికెట్ నంబర్ కే ప్రథమ బహుమతి వచ్చింది. జేమ్స్ మరోసారి లాటరీ కొడతానంటున్నాడు. అతడి అదృష్టం అలా ఉంది మరి.