: ఇందిరాగాంధీ ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదు: సీఎం కిరణ్
మన రాష్ట్రం ఇప్పటివరకు సమైక్యంగా ఉందంటే... దానికి కారణం ఇందిరాగాంధీనే అని సీఎం కిరణ్ తెలిపారు. ఈ రోజు ఇందిర 29వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి విశాఖలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 1969, 1972 ఉద్యమాల తర్వాత రాష్ట్రం కలిసి ఉండాలని చెప్పిన ఏకైన వ్యక్తి ఇందిరే అని అన్నారు. స్వర్గీయ ఇందిరాగాంధీ తన చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసమే తపించారని... ఆమె మరణం వల్లే రాష్ట్రానికి ఇలాంటి దుస్థితి ఏర్పడిందని చెప్పారు. హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసిన ఘనత సర్ధార్ వల్లభాయ్ పటేల్ దే అని సీఎం అన్నారు.