: బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి విఫలం: చంద్రబాబు
వరద బాధితులకు భరోసా ఇవ్వడంలో సీఎం విఫలమయ్యారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. అంతేకాకుండా, అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వడంలో కూడా ఆయన విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఈ రోజు ఉదయం విజయవాడలో ఆయన మాట్లాడారు. విపత్తులను ఎదుర్కోవడంలో కిరణ్ అవగాహన లోపం తేటతెల్లమైందని అన్నారు. ముంపుకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం లేదని చంద్రబాబు విమర్శించారు.