: ప్రపంచ ఉత్తమ ఉపాధ్యాయుడికి రూ.6 కోట్ల పురస్కారం: వీజీఎఫ్


భారత్ కు చెందిన వర్కీ జెమ్స్ ఫౌండేషన్(వీజీఎఫ్) ప్రపంచ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని నెలకొల్పింది. ఈ ఫౌండేషన్ యూఏఈ కేంద్రంగా పనిచేస్తోంది. ఇందులో పాల్గొనేందుకు ప్రపంచంలోని అన్ని దేశాల వారిని ఆహ్వానిస్తామని వీజీఎఫ్ వ్యవస్థాపకుడు, ఛైర్ పర్సన్ సన్నీ వర్కీ తెలిపారు. సమాజంపై ఉపాధ్యాయుల పాత్ర ఎంతగా ఉంటుందో తెలియజేసేందుకే ఈ పురస్కారం ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. కాగా వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతిపాదనల్లోంచి విజేతను ఎంపిక చేసి, 6 కోట్ల రూపాయల పురస్కారాన్ని అందజేస్తారు. లండన్ కు చెందిన 'ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్'దీనిపై ఆడిట్ నిర్వహిస్తుంది.

  • Loading...

More Telugu News