: తొలి వికెట్ కోల్పోయిన భారత్


భారీ లక్ష్యఛేదనలో భారత్ తొలి వికెట్ చేజార్చుకుంది. ఆసీస్ తో నాగపూర్ లో జరుగుతున్న ఆరో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ 79 పరుగులు చేసి ఫించ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 179 పరుగులు కాగా.. గెలవాలంటే ఇంకా 20 ఓవర్లలో 172 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లున్నాయి. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ శిఖర్ ధావన్ (90 బ్యాటింగ్) కు తోడు విరాట్ కోహ్లీ (0 బ్యాటింగ్) ఉన్నాడు. కాగా, భారత్ ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు ఆసీస్ కెప్టెన్ బెయిలీ ఏడుగురు బౌలర్లను వినియోగించడం విశేషం. ఎట్టకేలకు పార్ట్ టైమ్ బౌలర్ ఫించ్ రోహిత్ ను అవుట్ చేశాడు.

  • Loading...

More Telugu News