: అణువిద్యుత్ కేంద్రం వద్ద నాటుబాంబుల కలకలం
కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం వద్ద పోలీసులు నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. ప్లాంట్ పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థి బ్యాగులో తొలుత 2 బాంబులు లభించాయి. విద్యార్థి ఇచ్చిన సమాచారం మేరకు అణువిద్యుత్ కేంద్రం పరిసరాల్లో పెట్టిన 30 నాటుబాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.