: నవంబర్ లో ప్రిన్స్ చార్లెస్ ఉత్తరాఖండ్ పర్యటన.. భద్రత కట్టుదిట్టం


బ్రిటన్ రాజవంశీకుడు ప్రిన్స్ చార్లెస్, ఆయన భార్య కెమిల్లా పార్కర్ నవంబర్ 6న ఉత్తరాఖండ్ రానున్నారు. ఈ నేపథ్యంలో, దేశంలో పరిస్థితులు సరిగా లేనందున ఇప్పటినుంచి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ సుభాష్ కుమార్ పలువురు అధికారులతో డెహ్రాడూన్ లో సమావేశం నిర్వహించారు. బ్రిటన్ రాయల్ కపుల్ ఉత్తరాఖండ్ సందర్శనకు వస్తున్నందున వారు పర్యటించే రిషికేశ్, నరేంద్రనగర్, సెలాక్వి ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచాలని ఆదేశించారు. నవంబర్ ఆరున ప్రిన్స్ చార్లెస్, కెమిల్లా పార్కర్ డెహ్రాడూన్ లోని జాలీగ్రాంట్ విమానాశ్రయానికి చేరుకుని, అనంతరం పరమార్ధ్ నికేతన్ లో ఓ కార్యక్రమానికి హాజరవుతారు. తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

  • Loading...

More Telugu News