: ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లిన ఇరాక్ .. 21 మంది మృతి
ఆత్మాహుతి దాడులతో ఇరాక్ మరోసారి దద్దరిల్లింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో కనీసం 21 మంది మృతి చెందగా, మరో 46 మంది గాయపడ్డారు. నిన్న రాత్రి టార్మియా పట్టణంలో ఓ నాయకుడు ఇచ్చిన విందుకు ఆర్మీ, పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఆర్మీ దుస్తులతో విందులోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారిలో నాయకుని కుమారుడితో పాటు ఆర్మీ, పోలీసు అధికారులు కూడా ఉన్నారు. మరో ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ వద్ద రెండో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇక్కడ కూడా ప్రాణనష్టం జరిగింది.