: విభజనపై అఖిలపక్ష సమావేశానికి కేంద్రం సుముఖం
తెలంగాణపై మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్టు కేంద్ర మంత్రి షిండే తెలిపారు. నవంబర్ 7న జరిగే జీవోఎం భేటీ అనంతరం అఖిలపక్ష సమావేశం ఉంటుందని షిండే తెలిపారు. పార్లమెంటు సమావేశాలకు ముందే ఈ భేటీ ఉంటుందని, ఈ సమావేశంలో జీవోఎం విధివిధానాలపైనా చర్చిస్తామని షిండే తెలిపారు. కాగా, కేబినెట్ నోట్ పై అభిప్రాయాలు తెలపాలని పార్టీలకు కేంద్రం లేఖలు రాసింది. నవంబర్ 5 లోపు అభిప్రాయాలు చెప్పాలని లేఖలో పేర్కొంది.