: గ్యాసు, డీజిల్, కిరోసిన్ ధరల పెంపుకు కిరీట్ పరేఖ్ కమిటీ సిఫారసు
ప్రజలను ధరలతో చావబాదేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగా పెట్రో ధరల సవరణపై వేసిన కిరీట్ పరేఖ్ కమిటీ ప్రభుత్వానికి అనుకూలంగా పలు సూచనలు చేసింది. కిరీట్ పరేఖ్ కమిటీ సిఫారసుల ప్రకారం గ్యాస్, డీజిల్, కిరోసిన్ ల ధరలు పెరగనున్నాయి. గ్యాస్ సిలిండర్ పై 250 రూపాయలు పెంచాలని ఈ కమిటీ సూచించింది. అలాగే, సిలెండర్లపై వార్షిక రాయితీని 9 నుంచి 6 కు కుదించాలని తెలిపింది. మరోవైపు, లీటర్ డీజిల్ పై 6 రూపాయలు మాత్రమే రాయల్టీ ఇవ్వాలని సూచించింది. కిరోసిన్ లీటరుపై 4 రూపాయలు పెంచాలని సిఫారసు చేసింది. మరోవైపు, ఆర్టీసీ కూడా ధరలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినా అమలు చేయలేదు. కేంద్రం పెట్రో ధరల పెంపు నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరలు పెంచే అవకాశముంది. అంటే, సామాన్యుడిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ధరల భారం వేయనున్నాయి.