: ప్రధానికి చంద్రబాబు లేఖ


రాష్ట్రంలో తుపాను, వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టంపై ప్రధాని మన్మోహన్ సింగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో వరదలు, వర్షాల వల్ల నష్టపోయిన బాధితులను కేంద్రం తరపున ఆదుకోవాలని కోరారు. వెంటనే బాధితులకు నష్టపరిహారం అందించాలన్నారు. తడిసిన పత్తిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా సీసీఐని ఆదేశించాలని బాబు ప్రధానిని కోరారు. రాష్ట్రంలో వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, పంట నష్టపోయిన రైతులందరికీ మెరుగైన పరిహారం ఇవ్వాలని కోరారు.

  • Loading...

More Telugu News