: అవుటైన సెంచరీ హీరో.. ఊపిరి పీల్చుకున్న భారత బౌలర్లు


నాగపూర్ వన్డేలో ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ (102) సెంచరీతో అదరగొట్టాడు. 94 బంతులెదుర్కొన్న వాట్సన్ 13 ఫోర్లు, 3 సిక్సులతో భారత బౌలర్లను బెంబేలెత్తించాడు. కెప్టెన్ జార్జ్ బెయిలీతో కలిసి మూడో వికెట్ కు 168 పరుగులు జోడించిన వాట్సన్.. సెంచరీ సాధించిన అనంతరం మహ్మద్ షమి బౌలింగ్ లో వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 34.4 ఓవర్లలో 3 వికెట్లకు 213. క్రీజులో బెయిలీ (74 బ్యాటింగ్), మ్యాక్స్ వెల్ (0 బ్యాటింగ్) ఉన్నారు.

  • Loading...

More Telugu News