: బంగారంపై దిగుమతి టారిఫ్ విలువ పెంపు


పండుగ సీజన్లో దేశీయ మార్కెట్లో బంగారం కొరత నేపథ్యంలో బంగారంపై దిగుమతి టారిఫ్ విలువను కేంద్రం ప్రభుత్వం మళ్లీ పెంచింది. ఈ మేరకు పది గ్రాముల బంగారం దిగుమతిపై టారిఫ్ విలువను 442 డాలర్లకు (రూ.27,140) పెంచుతున్నట్లు 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్' ఆదేశాలు జారీ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. గత నెలలో ఇది 418 డాలర్లు(రూ.25,666)గా ఉంది. అటు, వెండి దిగుమతి టారిఫ్ విలువు కిలోల చొప్పున ఎప్పటిలానే 699 డాలర్లు (రూ.42,911) గానే ఉంచినట్లు తెలిపింది. బంగారాన్ని అత్యధికంగా వినియోగించే భారత్ ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో 393.68 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది.

  • Loading...

More Telugu News