: దీపావళికి హైదరాబాద్-జమ్మూ మధ్య ప్రత్యేక ట్రైన్
దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్-జమ్మూతావి మధ్య భారతీయ రైల్వే ప్రత్యేక ట్రైన్ నడపనుంది. పండుగ సందర్భంగా ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైలు నడపనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. ఈ నెల 31న (అంటే రేపు) ఉదయం పదిన్నర గంటలకు బయలుదేరనున్న హైదరాబాద్-జమ్మూతావి ఎక్స్ ప్రెస్ శనివారం రెండు గంటల సమయంలో జమ్మూ చేరుకుంటుంది. తిరిగి జమ్మూతావి-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ నవంబర్ నాల్గవ తేదీన ఉదయం ఐదు గంటల సమయంలో బయలుదేరి ఐదవ తేదీన రాత్రికి హైదరాబాద్ చేరుకుంటుందని పేర్కొంది.