: రాజ్ నాథ్ సింగ్ తో ముగిసిన సీమాంధ్ర బీజేపీ నేతల భేటీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో సీమాంధ్ర బీజేపీ నేతల భేటీ ముగిసింది. అనంతరం పార్టీ నేత హరిబాబు మీడియాతో మాట్లాడుతూ... రానున్న పార్లమెంట్ సమావేశాల్లో సీమాంధ్ర ప్రజల ఆందోళనలను లేవనెత్తుతామని రాజ్ నాథ్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. విభజన జరిగాక పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటామని అంటున్నారని.. అందువల్ల పోలవరం ముంపు ప్రాంతాలను కూడా సీమాంధ్రలోనే ఉంచాలని అధ్యక్షుడిని కోరినట్టు చెప్పారు.