: క్యూబా చేరుకున్న ఉప రాష్ట్రపతి
భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రెండు రోజుల పర్యటన నిమిత్తం క్యూబా చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో భేటీ కాబోతున్నారు. అయితే, కమ్యూనిస్టు యోధుడు ఫిడెల్ క్యాస్ట్రోతో అన్సారీ సమావేశం అవుతారా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆరోగ్యం దెబ్బతినడంతో ఫిడెల్ క్యాస్ట్రో 2006లో అధ్యక్ష పదవిని వదిలేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా క్యూబా నాయకత్వంతో అన్సారీ పలు ఒప్పందాలపై చర్చించే అవకాశం ఉంది.