: శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ
దక్షిణాదిలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే ఈ వార్షిక ఉత్సవాలు ఈ నెల 6న ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. మొత్తం 13 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు 18న జరిగే ఉత్సవ మూర్తుల శాంతి అభిషేకంతో ముగుస్తాయి.