: పాక్ ఆర్మీ సపోర్ట్ లేకుండా టెర్రరిస్టులు చొరబడలేరు: ఆంటోనీ


దాయాది దేశం పాకిస్థాన్ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ప్రతిరోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ సైన్యం మద్దతు లేకుండా టెర్రరిస్టులు సరిహద్దు వద్ద చొరబాటుకు ప్రయత్నించలేరన్నారు. అయితే, సరిహద్దు వద్ద ఎలాంటి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత్ సైన్యం పూర్తిగా సిద్ధమై ఉందని చెప్పారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆంటోనీ మాట్లాడుతూ.. సరిహద్దు వద్ద ఇంకా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయన్నారు. ఈ ఏడాది సరిహద్దు వద్ద పలు అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. కాగా, ఎలాంటి కఠిన సవాళ్ళనైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత రక్షణ దళాలకు ఎదుర్కొనే సామర్ధ్యం ఉందని ఆంటోనీ ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News