: అలుపెరుగని పాదచారి చంద్రబాబు
ప్రస్తుతం కృష్ణాజిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రజలు, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడంలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. నిన్న సాయంత్రం కురుమద్దాలిలో ప్రారంభమైన 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది.
కాగా, సినీ నటుడు బాలకృష్ణ కూడా నిన్న పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయన కొమరవోలు నుంచి బాబు వెంట నడిచారు. బాబు ప్రస్తుతం గుడివాడ సమీపంలోని గాంధీ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ రోజు ఆయన గుడివాడ నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు.