: బెంగళూరు పోలీసుల అదుపులో జబ్బార్ ట్రావెల్స్ నిర్వాహకుడు
ఈ తెల్లవారుజామున మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామం వద్ద జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు దగ్ధమై 45 మంది మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఘటన అనంతరం బెంగళూరులోని జబ్బార్ ట్రావెల్స్ యజమాని షకీల్ పరారయ్యాడు. అయితే, ట్రావెల్స్ నిర్వాహకుడు నయీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.