: షిండేతో ముగిసిన సీపీఐ నారాయణ బృందం భేటీ
కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో ఢిల్లీలో సీపీఐ నారాయణ బృందం భేటీ ముగిసింది. దాదాపు గంటపైన జరిగిన ఈ సమావేశంలో విభజన నేపథ్యంలో రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులు, తెలంగాణపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం, నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని షిండేను కోరినట్లు చెప్పారు. అప్పుడే ఎవరికి ఏం కావాలో తెలుస్తుందన్నారు. అయితే, విభజనకు సీఎం వ్యతిరేకంగా ఉన్నారని షిండేకు తెలిపామన్నారు.