: అల్లు అర్జున్ ను చూసేందుకు కంచె ఎక్కిన విద్యార్ధికి విద్యుత్ షాక్
హీరోను చూసేందుకు ఆతృతగా కంచె ఎక్కిన విద్యార్ధి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి హీరో అల్లు అర్జున్ వచ్చారు. ఆ సమయంలో ఆయనను చూసేందుకు అభిమానులు, ఇతరులు ఎగబడ్డారు. అదే సమయంలో హీరోను చూసేందుకు ఓ యువకుడు అక్కడే ట్రాన్స్ ఫార్మర్ పక్కన ఉన్న కంచె ఎక్కాడు. దాంతో, అతనికి విద్యుత్ షాక్ తగిలింది.