: శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా లేకపోవడంతో శ్రీవెంకటేశ్వరుని సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, కాలినడకన వచ్చే భక్తులకు కేవలం 2 గంటల్లో దర్శనం కల్పించేందుకు టీటీడీ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ రోజు ఉదయం శ్రీవారికి అష్టాదశపాద పద్మారాధన సేవ నిర్వహించారు.