: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన నారా లోకేశ్
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్... వోల్వో బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతేకాకుండా, ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.