: జబ్బార్ ట్రావెల్స్ యజమాని పరారీ.. ఫోన్ స్విచ్చాఫ్
మహబూబ్ నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన జబ్బార్ ట్రావెల్స్ బస్సు యజమాని షకీల్ బెంగళూరులో పరారయ్యాడు. బస్సు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసేశాడు. అనంతరం ఎవరికీ అందుబాటులో లేకుండా పోయాడు. ప్రస్తుతం అతని కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో, బెంగళూరులోని జబ్బార్ ట్రావెల్స్ ప్రధాన కార్యాలయానికి భారీగా చేరుకున్న ప్రజలు.. అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో, ఆ ప్రాంతంలో బెంగళూరు సివిల్, ట్రాఫిక్ పోలీసులు మోహరించారు.