: పోలీసులకు అంకితభావం ఉండాలి: గవర్నర్
విధి నిర్వహణలో పోలీసులు పూర్తి అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని... కేసులను వీలైనంత వేగంగా పరిష్కరించాలని సూచించారు. హైదరాబాదులోని ఏపీ పోలీస్ అకాడమీ (అప్పా) లో జరిగిన ప్రొబేషనరీ డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.