: దగ్ధమైన బస్సు నుంచి 41 మృత దేహాలు లభ్యం
మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద దగ్ధమైన బస్సు నుంచి ఇప్పటిదాకా 41 మృత దేహాలను వెలికితీశారు. బస్సు కింద భాగంలో మృత దేహాలు చిక్కుకోవడంతో కట్టర్ల సాయంతో బయటకు తీస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 49 మంది ఉన్నట్టు డ్రైవర్ ఫిరోజ్ తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే మరో మృతదేహం లభ్యం కావాల్సి ఉంది. మృత దేహాలకు డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం వారి బంధువులకు అప్పజెప్పనున్నారు.