: బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి, రవాణాశాఖా మంత్రి దిగ్భ్రాంతి
మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద వోల్వో బస్సు దగ్ధమయిన ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రవాణాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లాలని మహబూబ్ నగర్, కర్నూల్ జిల్లా ఎస్పీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా మంత్రి డీకే అరుణ ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఆమె తెలిపారు.