: మోడీకి వ్యతిరేకంగా భారతీయ అమెరికన్ ప్రొఫెసర్ల లాబీయింగ్


వార్టన్ ఇండియా ఆర్ధిక ఫోరం సదస్సులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ వీడియో ప్రసంగాన్ని రద్దు చేయడం వెనుక చాలా శక్తులు పనిచేసినట్టు కనిపిస్తోంది. పలు రకాల ఒత్తుడుల కారణంగానే ఆయన ప్రసంగాన్ని రద్దు చేసినట్టు చెబుతున్నారు. భారతీయ అమెరికన్ ప్రొఫెసర్లు దీని వెనుక పెద్ద లాబీయింగ్ చేశారు.

135 మంది సభ్యుల సంతకాలతో ముగ్గురు భారతీయ అమెరికన్లు ఓ పిటిషన్ పంపడం వల్లే, మోడీ ప్రసంగం రద్దయినట్టు పెన్సిల్వేనియా యూనివెర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తూర్జో ఘోష్ అమెరికాలో మీడియాకు తెలిపారు. ఈయన కూడా మోడీ ప్రసంగాన్ని వ్యతిరేకించిన వారిలో వున్నారు.

ఇదిలా ఉంచితే, ఈ విషయాన్ని భారతీయ జనతాపార్టీ లైట్ తీసుకుంది. దీని వల్ల మోడీకి ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. భారత్ లో ఎంతో పాప్యులారిటీ వున్న మోడీకి విదేశీ సంస్థల కితాబు, ధృవీకరణ అవసరం లేదని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు.

కాగా, మోడీ ప్రసంగం రద్దు నేపథ్యంలో, ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కూడా కార్యక్రమం నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు.                                            

  • Loading...

More Telugu News