: మహబూబ్ నగర్ జిల్లాలో వోల్వో బస్సు దగ్ధం: 40 మందికి పైగా సజీవ దహనం
మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద వోల్వో బస్సు దగ్ధమయింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణీకుల్లో 40 మందికి పైగా సజీవ దహనమయినట్టు తెలుస్తోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు వోల్వో బస్సు పాలెం వద్ద కల్వర్టును ఢీకొనడంతో డీజిల్ ట్యాంకర్ పేలి బస్సు వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమయింది. బస్సులో మొత్తం 49 మంది ప్రయాణీకులు ఉన్నట్టు సమాచారం. జబ్బార్ ట్రావెల్స్ కి చెందిన ఈ వోల్వో బస్సులో డ్రైవర్, క్లీనర్ తో పాటు మరో ఐదుగురు ప్రయాణీకులు సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.