: మితంగా చేసినా మంచిదే..


ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయాలి అనగానే సగం మంది నీరసపడిపోతుంటారు. తమకు అంత టైం ఉండదని, ఉరుకుల పరుగుల జీవితంలో ఖాళీ దొరకడం లేదని రకరకాల కారణాలు చెబుతుంటారు. వ్యాయామం అనగానే అదొక పెద్ద పని అనుకోవడమే దీనికి కారణం. అయితే వ్యాయామం పేరిట నడక, పరుగు, ట్రెడ్‌మిల్‌ వంటివి ఏకబిగిన గంటలకు గంటలు చేయాల్సిన అవసరం లేదుట.

నడక, తోటపనులు లాంటి చిన్న పనులైనా రోజుకు 20-30 నిమిషాలు చేసినా.. ఒత్తిడి తగ్గి మంచి ఆరోగ్యానికి ఉపకరిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మానసిక ఆరోగ్యానికి ఇవి ఎంతో హితం చేస్తాయని అంటున్నారు. అన్ని వయసుల వారికి ఇది వర్తిస్తుందని అధ్యయనం చేసిన ప్రొ. గే ఫౌల్కర్‌ అంటున్నారు.

  • Loading...

More Telugu News