: డైనోసారస్‌లు పెద్దవిగా ఉంటాయెందుకంటే..


డైనోసారస్‌లు ఏనుగుల కంటె అత్యంత భారీ ఆకారంతో ఉండడాన్ని మనం సినిమాల్లో చూసే ఉంటాం. అయితే అవి అంత పెద్దగా ఎందుకుంటాయనే దిశగా శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని కనుగొన్నారు. భూమ్మీద ఉండే ఇతర క్షీరద జంతువులకంటె.. వీటి కీళ్లు చాలా మెత్తగా ఉంటాయి గనుక.. ఇవి చాలా పెద్ద సైజుకు పెరుగుతాయని అనుకుంటున్నారు. ఓ తాజా అధ్యయనం ఈ విషయాన్ని తెలియజెబుతోంది. మొక్కలను తినే హెర్బివోర్స్ వంటి డైనోసారస్‌లు కూడా... ఇదే తరహాకు చెందినవని అధ్యయనం చెబుతోంది. వీటిలో సౌరోపోడ్స్ అనే వాటిలో అతి పెద్దవంటే 30 టన్నుల బరువు వరకు ఉంటాయని కూడా స్టడీ చెబుతోంది.

ఎముకల కీళ్లలో దీనికి సంబంధించిన కీలకం ఉండవచ్చుననే ఉద్దేశంతో.. న్యూజెర్సీలోని రిచర్డ్ స్టాక్‌టన్‌ కాలేజీకి చెందిన మాథ్యూ బొనాన్‌ మరియు సహచరులు ఈ విషయంలో పరిశోధనలు చేశారు. వీటి కీళ్లలో సాగే గుణం ఎక్కువగా ఉన్నందువల్లే పెద్ద ఆకారానికి పెరుగుతుండేవని తేల్చారు.

  • Loading...

More Telugu News