: అంగారకుడి మీదికి నాసా మావెన్ అంతరిక్షనౌక
అంగారకుడి నుంచి అంతరిరక్ష నౌక క్యూరియాసిటీ భూమ్మీద ఉన్న మనకు అందిస్తున్న వివరాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఇది అంగారక గ్రహం మీద పరిస్థితుల గురించి అనేక వివరాలు తెలిసేలా పరిశోధనలు సాగిస్తూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. నాసా మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది. మార్స్ అట్మాస్పియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ (మావెన్) అనే అంతరిక్షనౌకను అంగారక గ్రహం మీదికి త్వరలోనే పంపడానికి నాసా సన్నాహాలు చేస్తోంది.
అంగారక గ్రహంపై రోబోటిక్ పరిశోధనలు సాగించడంలో ఇది మరో ప్రధానమైన ముందంజ అవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. సౌరకుటుంబంలో ఇంచుమించు భూమిలాగా ఉండే అంగారక గ్రహం.. అంత విభిన్నంగా ఎందుకు స్థిరపడిపోయిందో తెలుసుకునే దిశగా ఈ మావెన్ పరిశోధనలు ఉంటాయని, అక్కడి వాతావరణం చరిత్రను తెలుసుకునే ప్రయత్నం జరుగుతుందని శాస్త్రవేత్త బ్రూక్ జాకోస్కీ చెబుతున్నారు.