: తేనెటీగల స్ఫూర్తితో రోబో విమానాలు


విమానం మరింత సులువుగా లాఘవంగా ల్యాండ్‌ కావడం కోసం రకరకాల టెక్నాలజీలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు తేనెటీగల స్ఫూర్తితో రోబో విమానాలను రూపొందించే పనిలో ఉన్నారు. తేలికపాటి విమానాల రూపకల్పన తేనెటీగల స్ఫూర్తితో చేస్తే.. ఎలాంటి ప్రతికూల వాతావరణం ఉపరితలాల మీదనైనా ల్యాండ్‌ అయ్యే వెసులుబాటు వస్తుందని భావిస్తున్నారు.

క్వీన్స్‌ల్యాండ్‌ యూనివర్సిటీ బ్రెయిన్‌ రీసెర్చి సెంటర్లో ఈ పరిశోధనలు సాగుతున్నాయి. భారతీయ సంతతికి చెందిన మాండ్యం శ్రీనివాసన్‌ కూడా ఇందులో పాల్గొంటున్నారు. దిగేప్పుడు వేగం తగ్గించుకుంటూ రావడంలో పక్షుల టెక్నిక్‌ను కూడా పరిశీలిస్తున్న వీరు తేనెటీగల టెక్నిక్‌ స్ఫూర్తినే రోబో విమానాలకు వాడాలని భావిస్తున్నారట.

  • Loading...

More Telugu News