: సచిన్ 'ఫేర్వెల్' పార్టీని భగ్నం చేస్తామంటున్న విండీస్ స్టార్


భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ ఆడే చివరి మ్యాచ్ లో భారత్ కు విజయాన్ని దూరం చేస్తామని విండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ అంటున్నాడు. క్రికిన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్ మాట్లాడుతూ, సచిన్ కు వ్యక్తిగతంగా సంతోషకరమైన ముగింపు దక్కాలని కోరుకుంటున్నానని తెలిపాడు. అయితే, సచిన్ కు ఆఖరి టెస్టులో విజయాన్ని కానుకగా అందించబోమని చెప్పాడు. సచిన్ 200వ టెస్టు గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నామని, భారీగా హాజరయ్యే అభిమానులతో వాంఖెడే మైదానం ఆహ్లాదకరంగా కనిపిస్తుందని భావిస్తున్నామని గేల్ పేర్కొన్నాడు. మ్యాచ్ ను రక్తికట్టించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గేల్ తెలిపాడు. కాగా, భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఈ మ్యాచ్ నవంబర్ 14 నుంచి 18 వరకు ముంబయి వాంఖెడే మైదానంలో జరగనుంది.

  • Loading...

More Telugu News