: మోడీని టార్గెట్ చేసుకునే బాంబులు పేల్చారు: వెంకయ్యనాయుడు
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సహా కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని పాట్నాలో బాంబు పేలుళ్ళకు పాల్పడ్డారని బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తాము దేనికీ బెదిరేదిలేదని ఆయన స్పష్టం చేశారు. భద్రతా వైఫల్యాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీకి ప్రధాని స్థాయి భద్రత కల్పించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ నేత అయినా ఆ పార్టీ వల్లభాయ్ పటేల్ ను విస్మరించిందని విమర్శించారు. 182 మీటర్ల అతి ఎత్తైన వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఈ నెల 31న భూమి పూజ నిర్వహిస్తున్నట్టు వెంకయ్యనాయుడు తెలిపారు.