: సీఎంతో కేంద్ర హోంశాఖ భద్రతా సలహాదారు విజయ్ కుమార్ భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కేంద్ర హోంశాఖ భద్రతా సలహాదారు విజయ్ కుమార్ భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కు నేతృత్వం వహిస్తున్న విజయ్ కుమార్ ముఖ్యమంత్రితో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర పరిస్థితులపై టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేసి, పలువురి నుంచి వివరాలు సేకరించి కేంద్రానికి నివేదిక అందజేయనుంది.