: వల్లభాయ్ పటేల్ తొలి ప్రధాని అయ్యుంటే దేశం ఇంకోలా ఉండేది: మోడీ


దేశానికి సర్థార్ వల్లభాయ్ పటేల్ తొలి ప్రధాని అయి ఉంటే దేశం స్థితిగతులు ఇంకోలా ఉండేవని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సర్థార్ వల్లభాయ్ పటేల్ మ్యూజియం ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీలు ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, స్వాతంత్ర్యానంతరం దేశ తొలి నాయకత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడిందని, అందువల్లే దేశంలో నేటికీ కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News