: సచిన్ ఫిఫ్టీ.. రసపట్టులో ముంబయి-హర్యానా రంజీ మ్యాచ్


హర్యానాలోని లాహ్లీలో ముంబయి, హర్యానా జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ రసపట్టులో పడింది. 240 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ముంబయి, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 39 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో నాలుగు వికెట్లున్నాయి. బ్యాటింగ్ లెజెండ్ సచిన్ (55 బ్యాటింగ్) ఫిఫ్టీ సాధించాడు. ప్రస్తుతం సచిన్ కు తోడు ధవళ్ కులకర్ణి (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. రేపు ఆటకు ఆఖరి రోజు. తొలి సెషన్ లో పిచ్ పేసర్లకు అనుకూలిస్తే ముంబయి ఓటమి తప్పకపోవచ్చు. కాగా, బౌలింగ్ కు విశేషంగా సహకరిస్తున్న ఈ పిచ్ పై తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. హర్యానా 134 పరుగులు చేయగా, ముంబయి 136 పరుగులు చేసింది. అనంతరం, హర్యానా రెండో ఇన్నింగ్స్ లో 241 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News