: గుంటూరు జిల్లాలో వ్యాపారి ఇంటిపై కాల్పులు
గుంటూరు జిల్లాలోని పిట్టలవాని పాలెంలో ఆంజనేయులు అనే వ్యాపారి ఇంటిపై దుండగులు కాల్పులు జరిపారు. దీనిపై వెంటనే స్థానిక పోలీసులకు వ్యాపారి ఫిర్యాదు చేశాడు. రూ.15 లక్షలు ఇవ్వాలని కొన్ని రోజుల కిందట అగంతకులు ఫోన్ ద్వారా డిమాండ్ చేశారని, అందుకు నిరాకరించడంతో ఈ ఉదయం తన నివాసంపై కాల్పులు జరిపినట్లు ఆంజనేయులు వివరించాడు. ఆ సమయంలో కుటుంబసభ్యులంతా ఇంట్లోనే ఉండటంతో ఎవరికీ ఏమీ కాలేదని చెప్పాడు. అయితే, కాల్పుల శబ్దాలకు చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. దాంతో, వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.