: ఐదు లక్షల కోట్లు తెలంగాణకే చెల్లించాలి: వివేక్
ఇన్నేళ్లుగా నష్టపోయిన తెలంగాణ ప్రాంతానికే ఐదు లక్షల కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ఎంపీ వివేక్ డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోతే నీటి యుద్ధాలు వస్తాయన్న సీఎం మాటల్లో వాస్తవం లేదని అన్నారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటిని సీమాంధ్ర పాలకులు తరలించుకుపోయారని విమర్శించారు. ఇన్నేళ్ల ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదిపై ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. రాయలసీమలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తయితే... కోస్తా ప్రాంతానికి కూడా నష్టం జరుగుతుందని వివేక్ అన్నారు. ఈ వివరాలన్నీ తాము కేంద్ర మంత్రుల బృందానికి సమర్పిస్తామని తెలిపారు.