: కాంగ్రెస్ లోనూ మంచివాళ్ళున్నారు : ముద్దుకృష్ణమ
కాంగ్రెస్ పార్టీలోనూ కొందరు మంచి వ్యక్తులు ఉన్నారని, వారు టీడీపీలోకి వస్తామంటే స్వాగతిస్తామని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ సహకారంతోనే సోనియా రాష్ట్రాన్ని విభజించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన టాస్క్ ఫోర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకపోతే వారే వెనక్కిపోతారని అభిప్రాయపడ్డారు. కేంద్రం విభజనపై చూపుతున్న శ్రద్ధ ప్రజలపై చూపడంలేదని మండిపడ్డారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ 40 ఎంపీ స్థానాలు వస్తాయని ఆశిస్తున్నాయని, వాటికి కనీసం నాలుగు స్థానాలు కూడా దక్కవని ముద్దుకృష్ణమ ఎద్దేవా చేశారు.