: శ్రీకాళహస్తీశ్వరునికి 188.5 కిలోల వెండి నంది బహుకరణ


అపోలో ఆసుపత్రుల అధినేత ప్రతాప రెడ్డి శ్రీకాళహస్తీశ్వరునికి 188.5 కిలోల బరువున్న వెండి నందిని బహుకరించారు. మొత్తం వెండితో తయారైన ఈ నంది వాహనం విలువ రూ. 1.10 కోట్లు.  శివరాత్రి సందర్భంగా ఇక్కడి వాయులింగేశ్వరుడు ఈ నందిపైనే ఊరేగింపుగా తరలనున్నాడు.

సోమవారం మధ్యాహ్నం వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రతాప రెడ్డి ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తికి నంది విగ్రహాన్ని అప్పగించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ వెండి నంది ఆలోచన ఇప్పటిది కాదని ప్రతాప రెడ్డి అన్నారు. రెండేళ్ల క్రితమే అనుకున్నప్పటికీ ఇన్నాళ్లకు అది నెరవేరిందని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News