: విభజన తీర్మానం అసెంబ్లీలో చర్చ జరగాలని అంబేద్కర్ చెప్పారు: ఉండవల్లి


ఆర్టికల్ 3ని అనుసరించి రాష్ట్ర విభజన ప్రక్రియ అసెంబ్లీ నుంచే మొదలు కావాలని కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ రోజు ఉండవల్లి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... రాజ్యాంగం తయారుచేసినప్పటి రోజుల్లో ఆర్టికల్ 3 విషయంలో ఏం జరిగిందో వివరించారు. రాజ్యాంగానికి సంబంధించి అంబేద్కర్ కు, కేటీ షా (బాబూ రాజేంద్రప్రసాద్ పై రాష్ట్రపతి పదవికి పోటీపడ్డారు)కు జరిగిన వాదనను చదివి వినిపించారు. రాష్ట్ర విభజన కానీ, రాష్ట్రాల కలయిక కానీ, రాష్ట్ర సరిహద్దులను మార్చాలనుకున్నప్పుడు కానీ నష్టపోతున్న ప్రాంత అసెంబ్లీ నిర్ణయాన్ని తీసుకోవాలని షా పార్లమెంటులో కోరారని... దీనికి అంబేద్కర్ స్పందిస్తూ.. రాజ్యాంగంలో పేర్కొన్న విషయం, షా డిమాండ్ చేసిన అంశం దాదాపు ఒకటే అని చెప్పారని ఉండవల్లి తెలిపారు.

అంతే కాకుండా, విభజన జరిగే రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కానీ, గవర్నర్ కానీ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర విభజన ప్రక్రియపై చర్చ జరగాలని అంబేద్కర్ చెప్పినట్టు ఉండవల్లి తెలిపారు. విభజన ప్రక్రియ అసెంబ్లీ నుంచే ప్రారంభమవ్వాలని, పార్లమెంటు నుంచి కాదని అంబేద్కర్ విస్పష్టంగా చెప్పారని అన్నారు. ఇది రాజ్యాంగ స్పూర్తి అని ఉండవల్లి చెప్పారు. ఈ నేపథ్యంలో, మనం రాజ్యాంగ పరిధిలో ఉన్న విషయం గుర్తెరగాలని, రాజ్యాంగంలోని స్పూర్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News